వివాహం – III

ఓం శ్రీరామా, పసుపు & కుంకుమ

మగపెళ్ళివారు ఇవ్వవలసినవి

తాంబూలాలికి

  • పెళ్ళికూతురుకి, తల్లికి, తండ్రికి, అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ములకి, మిగిలిన కుటుంబ పెద్దలకి బట్టలు పెట్టాలి
  • అమ్మాయికి ఉంగరం ఇవ్వాలి
  • స్వీట్స్, పళ్ళు ఇవ్వాలి
  • సుభలేఖ చదవాలి

పెళ్ళికి

అగ్నిహోత్రం సమయంలో:

  • పెళ్ళికూతురుకి 3 పట్టు చీరలు
  • బంగారం వస్తువులు పెట్టాలి

బంగారు ఆభరణాలు:

  • నల్ల పూసలు పెట్టాలి (బంగారం వి)
  • మామూలు నల్ల పూసలు
  • చిన్న బంగారు గొట్టం
  • బంగారు పూసలు కొనాలి

మంగళసూత్రం మరియు మెట్టెలు:

  • మంగళసూత్రం: ఒకటి మగపెళ్ళివారు, ఒకటి ఆడపెళ్ళివారు కొనాలి
  • మగపెళ్ళివారి ఆచారం ప్రకారం చేయాలి

ఇతర బట్టలు మరియు వస్తువులు:

  • పెళ్ళికూతురు తల్లికి స్థాలీపాకం సమయంలో తల్లి చీర పెట్టాలి
  • గ్రాండ్ పేరెంట్స్‌కి బట్టలు పెట్టాలి
  • పెళ్ళి కూతురు సోదరునికి:
    1. కాశీయాత్ర సమయంలో
    2. లాజ హోమం దగ్గర — బట్టలు పెట్టాలి
  • పెళ్ళికూతురుతో వెళ్ళిన వారికి బట్టలు పెట్టాలి
  • గృహప్రవేశానికి పెళ్ళికూతురుకి చీర పెట్టాలి

Written by: పూర్ణ దెందులూరి
Sep 13, 2011

Similar Posts

  • వివాహం – I

    ఓం శ్రీరామా, పసుపు & కుంకుమ వివాహ తంతులు వరుసక్రమం తాంబూలాలు ఇవి సాధారణంగా మగపెళ్ళి వారి ఇంటిలో జరుగుతాయి. లేనిచో రెండు కుటుంబాలకి వీలైన చోట జరుపుకోవచ్చు. ఆడపెళ్ళి వారు ఇవ్వవలసినవి: పెళ్ళి కొడుకుకి, తల్లికి, తండ్రికి, అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి బట్టలు పెట్టాలి మిగిలిన కుటుంబానికి ఆడపెళ్ళివారు అడిగిన దానిని బట్టి బట్టలు పెట్టాలి పెళ్ళి కొడుకుకి ఉంగరం కొనాలి 5 రకాల పళ్ళు, స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలి సుభలేఖ చదవాలి…

  • వివాహం – II

    ఓం శ్రీరామా, పసుపు & కుంకుమ పెళ్ళిలో అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయికి పెట్టవలసిన బట్టలు మరియు వస్తువులు తాంబూలాలు బట్టలు పెట్టవలసినవారు: అబ్బాయికి, తల్లికి, తండ్రికి అన్న తమ్ములకి, అక్క చెల్లెళ్ళకి రెండు పక్కల గ్రాండ్ పేరెంట్స్‌కి మిగిలిన వారికి పెళ్ళివారితో సంప్రదించి వారి కోరిక మేరకు బట్టలు పెట్టడం మంచిది స్నాతకం పెళ్ళి కొడుకుకి బట్టలు పెట్టాలి పానకం బిందెలు, గ్లాసులు ఇవ్వాలి వరపూజ (ఎదురు సన్నాహం) పెళ్ళి కొడుకుకి బట్టలు పెట్టాలి పెళ్ళి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *