వివాహం – I

ఓం శ్రీరామా, పసుపు & కుంకుమ

వివాహ తంతులు వరుసక్రమం

తాంబూలాలు

ఇవి సాధారణంగా మగపెళ్ళి వారి ఇంటిలో జరుగుతాయి. లేనిచో రెండు కుటుంబాలకి వీలైన చోట జరుపుకోవచ్చు.

ఆడపెళ్ళి వారు ఇవ్వవలసినవి:

  • పెళ్ళి కొడుకుకి, తల్లికి, తండ్రికి, అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి బట్టలు పెట్టాలి
  • మిగిలిన కుటుంబానికి ఆడపెళ్ళివారు అడిగిన దానిని బట్టి బట్టలు పెట్టాలి
  • పెళ్ళి కొడుకుకి ఉంగరం కొనాలి
  • 5 రకాల పళ్ళు, స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలి
  • సుభలేఖ చదవాలి

మగపెళ్ళివారు ఇవ్వవలసినవి:

  • వధువుకి, తల్లికి, తండ్రికి, అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ములకి, మిగిలిన కుటుంబ పెద్దలకి బట్టలు పెట్టాలి
  • వధువుకి ఉంగరం పెట్టాలి
  • 5 రకాల పళ్ళు, స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలి

వివాహం

మగపెళ్ళివారు కళ్యాణ మండపానికి రాగానే వియ్యపురాలికి అలంకరణ సామగ్రితో పళ్ళెం ఇవ్వాలి.

పళ్ళెంలో పెట్టవలసినవి:

  • పసుపు, కుంకుమ, సున్నపు పిండి
  • షాంపూ, నూనె, పేస్టు, బ్రష్‌లు, సబ్బులు
  • టవల్, నాప్కిన్, బొట్టు స్టిక్కర్స్
  • పర్ఫ్యూమ్ బాటిల్, tongue cleaners
  • కాటుక, దువ్వెన, అద్దం

స్నాతకం

ఇది మగపెళ్ళివారు చేసుకునే కార్యక్రమం. దీనికి కావలసిన సామగ్రి (బ్రహ్మ గారు ఇచ్చిన లిస్టు) ఆడపెళ్ళివారు ఏర్పాటు చేయాలి.

కాశీయాత్రకు ఇవ్వవలసినవి:

  • పెళ్ళి కొడుకుకి బట్టలు
  • గొడుగు, కర్ర, చెప్పులు
  • వేడుక కోసం వెండి గొడుగు, కర్ర, చెప్పులు (చిన్న సైజులో) ఇస్తారు
  • మగపెళ్ళి వారు వధువు సోదరునికి బట్టలు పెట్టాలి

ఎదురు సన్నాహం (వరపూజ)

దీనినే వరపూజ అంటారు. ఇది వివాహ కార్యక్రమం ముందు జరుగుతుంది.

ఈ సమయంలో ఇవ్వవలసినవి:

  • వరునికి బట్టలు
  • వియ్యపురాలికి పానకం బిందెలు, గ్లాసులు (వెండివి)
  • వెండి సుభలేఖ చదవాలి

సరదా కార్యక్రమం:

  • అబ్బాయి వైపువారు ఒక వైపు, అమ్మాయి వైపువారు ఒక వైపు కూర్చోవాలి
  • మగపెళ్ళి వారికి అందరికి కర్పూరం దండలు వేయాలి
  • చిన్న చిన్న బహుమతులు ఇవ్వాలి

వివాహ కార్యక్రమం

పూర్తి వరుసక్రమం:

  1. పెళ్ళికూతురు, తల్లితండ్రులు అంకురార్పణ చేసుకోవాలి
  2. పెళ్ళికూతురు చేత గౌరీపూజ చేయించాలి
  3. కన్యావరణాలు చదవాలి
  4. తర్వాత అబ్బాయికి ఉత్తరీయం, ఉపవీతం వేయాలి
  5. వరుసగా: కాళ్ళు కడగడం, కన్యాదానం, సుముహూర్తం, కాడి పెట్టడం
  6. మధుపర్కాలు, జ్యోతులు
  7. మంగళ సూత్రం కట్టడం, తలంబ్రాలు, ఆశీర్వచనం జరపాలి
  8. 10 నిమిషాలు విశ్రాంతి ఇచ్చి అగ్నిహోత్రాలు చేయించాలి (స్థాలీపాకం, నాగవల్లి, సప్తపది)
  9. తర్వాత వధు వరులకి భోజనం పెట్టి, దొంగ వేలం, ఉయ్యాల, లాంచనాలు, సారె, అప్పగింతలు చేయాలి
  10. తర్వాత అమ్మాయికి వడికట్టు కట్టి అత్తవారింటికి పంపాలి (తల్లి కూడా వెళ్ళకూడదు)
  11. మర్నాడు అబ్బాయి ఇంటిలో సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. అప్పుడు వారికి బట్టలు పెట్టాలి

Written by: పూర్ణ దెందులూరి
Sep 13, 2011

Similar Posts

  • వివాహం – II

    ఓం శ్రీరామా, పసుపు & కుంకుమ పెళ్ళిలో అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయికి పెట్టవలసిన బట్టలు మరియు వస్తువులు తాంబూలాలు బట్టలు పెట్టవలసినవారు: అబ్బాయికి, తల్లికి, తండ్రికి అన్న తమ్ములకి, అక్క చెల్లెళ్ళకి రెండు పక్కల గ్రాండ్ పేరెంట్స్‌కి మిగిలిన వారికి పెళ్ళివారితో సంప్రదించి వారి కోరిక మేరకు బట్టలు పెట్టడం మంచిది స్నాతకం పెళ్ళి కొడుకుకి బట్టలు పెట్టాలి పానకం బిందెలు, గ్లాసులు ఇవ్వాలి వరపూజ (ఎదురు సన్నాహం) పెళ్ళి కొడుకుకి బట్టలు పెట్టాలి పెళ్ళి…

  • వివాహం – III

    ఓం శ్రీరామా, పసుపు & కుంకుమ మగపెళ్ళివారు ఇవ్వవలసినవి తాంబూలాలికి పెళ్ళికూతురుకి, తల్లికి, తండ్రికి, అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ములకి, మిగిలిన కుటుంబ పెద్దలకి బట్టలు పెట్టాలి అమ్మాయికి ఉంగరం ఇవ్వాలి స్వీట్స్, పళ్ళు ఇవ్వాలి సుభలేఖ చదవాలి పెళ్ళికి అగ్నిహోత్రం సమయంలో: పెళ్ళికూతురుకి 3 పట్టు చీరలు బంగారం వస్తువులు పెట్టాలి బంగారు ఆభరణాలు: నల్ల పూసలు పెట్టాలి (బంగారం వి) మామూలు నల్ల పూసలు చిన్న బంగారు గొట్టం బంగారు పూసలు కొనాలి మంగళసూత్రం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *