ఓం శ్రీరామా, పసుపు & కుంకుమ
పెళ్ళిలో అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయికి పెట్టవలసిన బట్టలు మరియు వస్తువులు
తాంబూలాలు
బట్టలు పెట్టవలసినవారు:
- అబ్బాయికి, తల్లికి, తండ్రికి
- అన్న తమ్ములకి, అక్క చెల్లెళ్ళకి
- రెండు పక్కల గ్రాండ్ పేరెంట్స్‌కి
- మిగిలిన వారికి పెళ్ళివారితో సంప్రదించి వారి కోరిక మేరకు బట్టలు పెట్టడం మంచిది
స్నాతకం
- పెళ్ళి కొడుకుకి బట్టలు పెట్టాలి
- పానకం బిందెలు, గ్లాసులు ఇవ్వాలి
వరపూజ (ఎదురు సన్నాహం)
- పెళ్ళి కొడుకుకి బట్టలు పెట్టాలి
పెళ్ళి సమయంలో
ఇవ్వవలసినవి:
- అబ్బాయికి మరియు అమ్మాయికి మధుపర్కాలు
- అగ్నిహోత్రం దగ్గర:
- ఒక జత పట్టు పంచలు
- రెండు జతలు బట్టలు
- వెండి కంచం, వెండి చెంబు, వెండి గ్లాసు
- అబ్బాయికి బంగారు ఆభరణం
అప్పగింతలు
- పెళ్ళి కొడుకు మరియు కుటుంబం అందరికి సంప్రదించి బట్టలు పెట్టాలి
- ఎవరెవరికి అప్పగించాలో అందరికి బట్టలు పెట్టాలి
లాంచనాలు
- వియ్యపురాలికి, ఆడపడుచులకి పట్టు బట్టలు మరియు ఆభరణాలు
- సంప్రదించిన మేరకు తృప్తిగా ఇవ్వాలి
సారె
అత్త గారికి ఇవ్వవలసినవి:
- చీర
- లడ్డు, మినప సున్ని, అరిసెలు
- చలిమిడి మరియు ఖారం బూంది
- పసుపు, కుంకుమ, సున్నపు పిండి
- కుంకుడు కాయలు లేదా షాంపూలు
పెళ్ళికూతురు కి తల్లి తండ్రి కొనవలసినవి
పట్టు చీరలు (5 చీరలు)
- తాంబూలాలు
- పెళ్ళికూతురు
- బుట్టలో చీర
- గృహప్రవేశం
- సత్యనారాయణ వ్రతం
ఇతర వస్తువులు
- తెలుపుకి ఎరుపు అంచు మధుపర్కాలు కొనాలి
- తోడు పెళ్ళికూతురుకి బట్టలు కొనాలి
పెళ్ళికూతురుకి బంగారం
కనీసం కొనవలసినవి:
- గొలుసు, గాజులు
- చెవులకి బుట్టలు
- మట్టెలు, మంగళసూత్రం
- తర్వాత మన ఇష్టం ప్రకారం
సారాంశం
| వ్యక్తి | బట్టలు/వస్తువులు |
|---|---|
| పెళ్ళి కొడుకు | మొత్తం ఎనిమిది జతలు |
| అత్త గారు | అయిదు చీరలు + జాకెట్లు |
| మామ గారు | మూడు సార్లు బట్టలు |
| ఆడపడుచు | నాలుగు సార్లు బట్టలు |
Written by: పూర్ణ దెందులూరి
Sep 13, 2011
