వివాహం - II

ఓం శ్రీరామా , పసుపు & కుంకుమ

పెళ్ళిలో అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయికి పెట్టవలసిన బట్టలు మరియు వస్తువులు

తాంబూలాలు లో

అబ్బాయికి, తల్లికి, తండ్రికి, అన్నదమ్ములకి, అక్కచెల్లిళ్ళకి, రెండు పక్కల గ్రాండ్ పేరెంట్స్ కి బట్టలు పెట్టాలి. మిగిలిన వారికి పెళ్ళివారితో సంప్రదించి వారి కోరిక మేరకు బట్టలు పెట్టడం మంచిది.

స్నాతకం లో

పెళ్లి కొడుకుకి బట్టలు పెట్టాలి. పానకం బిందెలు గ్లాసులు ఇవ్వాలి.

వరపూజ అంటే ఎదురు సన్నాహం లో

పెళ్లి కొడుకుకి బట్టలు పెట్టాలి

పెళ్లి టైం లో

అబ్బాయికి మరియు అమ్మాయికి మధుపర్కాలు, అగ్ని హోత్రం దగ్గిర ఒక జత పట్టు పంచలు మరియు రెండు జతలు బట్టలు, వెండి కంచం, వెండి చెంబు, వెండి గ్లాసు + అబ్బాయికి బంగారు ఆభరణం.

అప్పగింతల లో

పెళ్లి కొడుకు మరియు కుటుంబం అందరికి సంప్రదించి బట్టలు పెట్టాలి. ఎవరెవరికి అప్పగించాలో అందరికి బట్టలు పెట్టాలి.

లాంచనాలు

వియ్యపు రాలు కి, ఆడపడుచులుకి, పట్టు బట్టలు మరియు ఆభరణాలు - సంప్రదించిన మేరకు, తృప్తి గా  ఇవ్వాలి

సారె

అత్త గారికి చీర మరియు క్రింద వ్రాసిన అయిటంస్ అన్ని ఇవ్వాలి.

లడ్డు, మినప సున్ని, అరిసెలు, చలిమిడి మరియు ఖారం బూంది, పసుపు, కుంకుమ, సున్నిపిండి మరియు కుంకుడు కాయలు లేక షాంపూలు.

 

పెళ్లికూతురు కి తల్లి తండ్రి కొనవలసినవి

    ·         పట్టు చీరలు 5 :--

1.      తాంబూలాలు

2.      పెళ్ళికూతురు

3.      బుట్టలో చీర

4.      గృహప్రవేశం

5.      సత్యనారాయణ వ్రతం

    ·         తెలుపుకి రెడ్ అంచు మధుపర్కాలు కొనాలి.

    ·         తోడు పెల్లికూతురుకి బట్టలు కొనాలి.

    ·         పెల్లికూతురుకి బంగారం :--

                    గొలుసు, గాజులు, చెవులకి బుట్టలు ఇవి మినిమమ్. తర్వాత మన ఇష్టం.

 

                    మట్టెలు మంగళసూత్రం కొనాలి.

Summary

పెళ్లి కొడుకు కి మొత్తం ఎనిమిది జతలు

అత్త గారికి అయిదు చీరలు + జాకెట్టులు

మామ గారికి మూడు సార్లు బట్టలు పెట్టాలి

ఆడపడుచు కి నాలుగు సార్లు బట్టలు పెట్టాలి

 

పూర్ణ దెందులూరి