వివాహం - I

ఓం శ్రీరామా , పసుపు & కుంకుమ

వివాహ తంతులు వరుసక్రమం

 

తాంబూలాలు

ఇవి సాధారణంగా మగపెల్లి వారి ఇంటిలో జరుగుతాయి.లేనిచొ రెండు కుటుంబాలకి  వీ లైనచోట జరుపుకోవచ్చు.

 

ఆడపెళ్ళి వారు ఇవ్వవలసినవి:--పెళ్లి కొడుకుకి,తల్లికి,తండ్రికి,అక్క చెల్లెళ్ళు కి అన్నతమ్ముళ్ళకి బట్టలు పెట్టాలి.మిగిలిన కుటుంబానికి ఆడపెళ్ళివారు అడిగిన దానిని బట్టి బట్టలు పెట్టాలి. పెల్లికొడుకుకి ఉంగరం కొనాలి.  

5 రకాల పళ్ళు ,స్వీట్స్ dryfruits ఇవ్వాలి.సుభలేఖ చదవాలి.

మగపెళ్ళివారు ఇవ్వవలసినవి :--వధువుకి,తల్లికి తండ్రికి అక్క చేల్లెల్లుకి అన్నతమ్ములకి,మిగిలిన కుటుంబ

పెద్దలకి బట్టలు పెట్టాలి.వధువుకి ఉంగరం పెట్టాలి.

5 రకాల పళ్ళు స్వీట్స్ dryfruits ఇవ్వాలి.

 

వివాహం

 మగపెల్లివారు కళ్యాణ మండపానికి రాగానే వియ్యపురాలికి అలంకరణ సామాగ్రి తో పళ్ళెం ఇవ్వాలి.

 

ఆ పళ్ళెం లో పెట్టవలసినవి :--పసుపు,కుంకుమ,సున్నిపిండి షాంపూ, నూని,పేస్టు brushes సబ్బులు నాప్కిన్ బ్లాకు stickers, perfume బాటిల్, tongue cleaners, towel, కాటుక, దువ్వెన్న, అద్దం.

 

స్నాతకం

ఇది మగపెల్లివారు చేసుకునే కార్యక్రమం,దీనికి కావలసిన సామాగ్రి (బ్రహ్మ గారు ఇచ్చిన లిస్టు)ఆడపెళ్ళివారు ఏర్పాటు చేయాలి.కాసియాత్రకి,పెళ్లి కొడుకుకి బట్టలు గొడుగు కర్ర చెప్పులు ఇవ్వాలి.ఈ టైములో వేడుక కోసం వెండి గొడుగు,కర్ర,చెప్పులు చిన్నసిజువి ఇస్తారు.మగపెల్లి వారు వధువు సోదరునికి బట్టలు పెట్టాలి.

 

ఎదురు సన్నాహం

దీనినే వరపూజ అంటారు.ఇది వివాహ కార్యక్రమం ముందు జరుగుతుంది.ఈసమయంలో వరునికి బట్టలు,వియ్యపురా లికి పానకం బిందెలు గ్లాసు (వెండివి) ఇవ్వాలి.వెండి సుభలేఖ చదవాలి.

ఎదురు సన్నాహం ఒక సరదాకార్యక్రమం అబ్బాయి వైపువారు ఒక వైపు,అమ్మాయి వైపువారు ఒకవైపు కూర్చోవాలి.మగపెల్లి వారికీ అందరికి కర్పూరం దండలు వేయాలి.చిన్న చిన్న బహుమతులు ఇవ్వాలి.

వివాహం

పెళ్ళికూతురు,తల్లితండ్రులు అంకురార్పణ చేసుకుని,పెల్లికుతురుచేత గౌరీపూజ చేయించాలి.కన్యావరణాలు చదవాలి.తర్వాత అబ్బాయికి ఉత్తర జంధ్యాలు వేయాలి.తర్వాత వరుసగా కాల్లుకడుగుట కన్యాదానం సుముహుర్తం,కాడి పెట్టుట,మధుపర్కాలు జ్యోతులు మంగళ సూత్రం కట్టుట తలంబ్రాలు ఆసిర్వచనం జరపాలి.10 నిముషాలు విశ్రాంతి ఇచ్చి అగ్నిహోత్రాలు చేయించాలి అంటే స్థాలీపాకం నాగవల్లి సదస్యం.తర్వాత వదువరులకి భోజనం పెట్టి దొంగవేలం,ఉయ్యాల,లాంచనాలు సారే అప్పగింతలు చెయ్యాలి.తర్వాత అమ్మాయికి వడికట్టు కట్టి అత్తవారింటికి పంపాలి.

తల్లికూడా వెళ్ళకూడదు.మర్నాడు అబ్బాయి ఇంటిలో సత్య నారయణ వ్రతం చేసుకుంటారు.అప్పుడు వారికీ బట్టలు పెట్టాలి.    

 

 

పూర్ణ దెందులూరి.